Viral

పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

WhatsApp Image 2024-03-03 at 6.10.23 PM

కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు నిర్మించిందని అయితే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పోరంబోకు పిడబ్ల్యూటీ స్థలాల్లో గత 40 సంవత్సరాలుగా పేదలు పాకలు వేసుకుని జీవిస్తున్నారని వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు గాని కార్యరూపం దాల్చడం లేదన్నారు.

ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పేదవాడు కాళ్లు అరిగిపోతున్నాయి తప్ప పాలకుల కు మాత్రం మనసు కరగడం లేదన్నారు. కాకినాడ జిల్లా కార్యదర్శి కే. బాడకొండ మాట్లాడుతూ… కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడిన కేజీ బేసిన్ గ్యాస్ సమురులో 50% వాటా మన రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని ఆయన అన్నారు. దీనిపై ఈనెల 4న అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమo లో మంగళగిరి దేవి .పిట్టా భావాని Mరామలక్ష్మి ,సంగం వినిత కీర్తన ,మానెపల్లి సరస్వతి తదితరులు పాల్గున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.