ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను పేదరికం నుండి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో అధిక జనుల ఐకమత్యాన్ని సాధించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించే దృఢ సంకల్పంతో ఐక్యత విజయ పదం కార్యక్రమాన్ని రూపొందించినట్లు మాజీ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఐక్యత విజయ పదం పాదయాత్ర కాకినాడ చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో పెరుగుతున్న పేదరికం తరిమికొట్టేందుకు, బడుగు బలహీన వర్గాలలో సామాజిక చైతన్యం కలిగించి వారిలో రాజకీయ లక్షణాలను పెంపొందించే దిశగా రూపొందించారన్నారు.
ఐక్యత విజయ పదం గత సంవత్సరం 2023 23న ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు తిరుపతి జిల్లాలోని నుండి ఈ పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. సుమారు 2500 కి.మీ. దాటి ఈ యాత్ర ముందుకు సాగుతుందన్నారు. 11 జిల్లాల్లో 55 నియోజకవర్గాలు 130 మండలాలు 1150 కి పైగా గ్రామాలు పట్టణ నగరాలలో సుమారు లక్ష మందికి పైగా పేద జనాన్ని కలుసుకొని వారి కష్టనష్టాలను తెలుసుకుంటన్నామన్నారు.
