
పెద్దాపురంలో నూతనంగా డ్వాక్రా బజార్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలచే తయారు చేయబడిన ఉత్పత్తులు తక్కువ ధరలకే లభించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఈ బజార్‌ను మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ శనివారం ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా ఎదిగేందుకు డ్వాక్రా సంఘాల సమన్వయం దోహదపడుతుందని ఛైర్మన్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ డ్వాక్రా బజార్ ను ప్రారంభించారు.
