జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో వైమానిక దళ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారీ సెర్చ్ మరియు కార్డన్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబందిత అధికారులు వెళ్లడించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు వారి కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో ఒక ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన నలుగురిలో ఒక ఎయిర్‌మెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గాయపడిన సైనికులు ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌కు మూడు వారాల ముందు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పూంచ్ లో వైమానిక దళ కాన్వాయ్‌పై దాడి… ఒకరు మృతి…

