Political

పీ.ఎం. కేర్స్ ఫండ్ రహస్యాలను బయటపెడతాం… -ఎంకే స్టాలిన్-

Divide_between_urban_India__rural_Bharat_closing_Mukesh_Ambani__11_

డి.ఎం.కె. యొక్క లోక్‌సభ ప్రచారాన్ని కిక్‌ స్టార్ట్ చేస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శుక్రవారం అవినీతిపై బి.జె.పి. నేతృత్వంలోని కేంద్రంపై దాడి చేసి, పి.ఎం. కేర్స్ ఫండ్ ద్వారా డబ్బును దోపిడీ చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పీ.ఎం. కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలు బట్టబయలు అవుతాయని ఆయన అన్నారు.

తిరుచిరాపల్లిలో జరిగిన ర్యాలీలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. బీ.జే.పీ. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. తమ అవినీతిని దాచడానికి, వారు అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామన్న బీ.జే.పీ. భయం మాత్రమే దీనికి కారణమన్నారు.

మనీష్ సిసోడియా 13 నెలలు జైలులో ఉన్నారు. గత నెల, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు చేశారు అని అతను చెప్పాడు. ప్రజలు తమపై తిరగబడ్డారని, వారిపై పోరాడేందుకు ప్రతిపక్షాలు చేతులు కలిపాయని గ్రహించిన బీ.జే.పీ. నేతలు తప్పుడు పనులు చేస్తున్నారని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.