పి.డి.ఎస్ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.
బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ వాహనంలో 12 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 600 కేజీల పి.డి.ఎస్ బియ్యాన్ని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు.
ఈ సందర్బంగా ఎస్.పీ. కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ… పి.డి.ఎస్ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎవ్వరైనా పి.డి.ఎస్ బియ్యం కొనడం, అమ్మడం చేస్తే అటువంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాటి విలువ సుమారు రూ 2,27,300 ఉంటుందని తెలిపారు.

