తెలుగుదేశం పార్టీ నాయకులు పినపోతు తాతారావు పుట్టిన రోజు వేడుకలను ఘణంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేశాయనీ ఆయన అన్నారు. ఇటీవల జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర లో తెలుగు దేశం పార్టీ లో చేరడం జరిగిందన్నారు. మాజీ కౌన్సిలర్ ముర్థండ నాగేశ్వర రావు, చెక్క లక్ష్మణ్, పినపోతు మాతరాజు, నాటి ధర్మారావు, లంకాడి వీర్రాజు, పినపోతు కనకరాజు, బంధన రాజు తదితరులు పాల్గొన్నారు.
పినపోతు తాతారావు జన్మదిన వేడుకల్లో టీ.డీ.పి. అభిమానులు…

