పిఠాపురం నియోజకవర్గంలోని వై.సీ.పీ. ముఖ్య నాయకులు, కార్యకర్తలు వై.సీ.పీ. కి భారీ షాక్ ఇచ్చారు. వారందరూ ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం వై.సీ.పీ. ప్రెసిడెంట్ ఎలుబండి లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ నాయకులు నూతాటి హరిబాబు, యువజన నాయకులు దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణ్ రావు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తమ్మనబోయిన సుదర్శన్, తమ్మనబోయిన ఫణీంద్ర కలవలపల్లి సత్తిబాబు, దుగ్గన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం జనసేనలో బారీగా చేరికలు…

