కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో తెలుగు నటుడు, రాజకీవ వేత స్వర్గీయ నందమూరి తారక రామరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వారు ఎన్.టీ.ఆర్. విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఎన్.టీ.ఆర్. అన్నారు. ఈ కర్యక్రమానికి తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పిఠాపురంలో ఘనంగా ఎన్.టీ.ఆర్. 101వ జయంతి కార్యక్రమం…

