ఏ.పీ. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టిడిలో ముఖ్య అతిథులుగా కిర్ల కృష్ణారావు, ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ… పనివేళలు సక్రమంగా అమలు చేయాలని, పండగ జాతీయ సెలవులు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. వారితో వెట్టి చాకిరి పనులు చేయించడం మానుకోని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని సమ్మె పరిష్కారానికై మంత్రులతో చర్చించి జీతాలు పెంచాలని అన్నారు. లేకుంటే సమ్మె తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు.

