బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి ఈరోజు సాయంత్రానికి రెమాల్ తుపానుగా మారే అవకాశం ఉన్నందున పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 25, 26 సాయంత్రానికి తీవ్ర తుఫానుగా పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుంది. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంత జిల్లాలు, ఉత్తర ఒడిశా పరిసర జిల్లాల్లో మే 26, మే 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్ తీరానికి చేరువవుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. మే 24 సాయంత్రానికి వాతావరణం మరింత దిగజారుతుందని అంచనా వేసింది. మే 27 ఉదయం వరకు బంగాళాఖాతంలోకి వెళ్లకుండా మత్స్యకారులకు వాతావరణ శాఖ సూచించింది.