పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమ మద్యం నిల్వల తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు చేస్తున్నారనే సమాచారంతో ఎస్.ఈ.బీ. టీడీపీ మాజీ ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్ కు చెందిన రొయ్యల చెరువుల వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ను సోదాచేసారు. ఆ తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని కనిపెట్టినట్లు తెలిపారు. తనిఖీలలో 110 ఫుల్ బాటిళ్లు, 72 టిన్ బీర్లు దొరికాయని అధికారులు తెలిపారు. ఆ చెరువుకు కాపలాగా ఉన్న అంగర అప్పల నర్సయ్య ను, వాచ్మన్ అంగర సుబ్బారావు ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని వెళ్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం సీజ్…

