పిఠాపురం ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని డబ్బులు కి అమ్ముడు పోయే వ్యక్తులు ఎవరూ లేరని ముద్రగడ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. కిర్లంపూడి లో ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వై.సీ.పీ. నాయకులు ముద్రగడతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాకినాడ వై.సి.పి. పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు.
గొల్లప్రోలు మండలం వై.సి.పి. నాయకులు కార్యకర్తల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ… నియోజకవర్గంలో వై.సీ.పీ. ని గెలిపించి వంగా గీతను శాసనసభకు, పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ ని గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చిరస్థాయిలో గుర్తింపుగా నిలిచాయన్నారు. నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు సహకారంతో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ముద్రగడ హామీ ఇచ్చారు.

