జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడిందని తెలిపారు. ఈ రోజు ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తడంతో ఈ అంతరాయం ఏర్పడింది. ఆయన హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తిందని వారు తెలిపారు. పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడినట్లు వెళ్లడించారు. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేయడమైనదని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అంతరాయం… హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య…

