Exclusive

పల్లెవెలుగు బస్ రేట్లను తగ్గించాలి… -పౌరసంక్షేమ సంఘం-

pallivelugu

పల్లె వెలుగు బస్సుల్లో అల్ట్రా బస్ వేరయా అన్నట్టుగా రూ.10 ల అదనపు ధర వసూలు చేయడం దోపిడీ చందంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ జగన్నాధపురం నుండి ద్రాక్షారామానికి వెళ్ళే పల్లె వెలుగు బస్ రూ.30 ల టికెట్ ధర వసూలు చేస్తుండగా అల్ట్రా పల్లె వెలుగు బస్ లో రు. 40 వసూలు చేయడం తగదన్నారు. కొత్త బస్సు అయినంత మాత్రాన అదనంగా పది రూపాయలు రుబాబు గా వసూలు చేస్తున్న విధానం సవరించాల్సిన అవసరం వుందని వారు డిమాండ్ చేశారు. సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన పల్లెవెలుగు లో జరుగుతున్న అడ్డగోలు దోపిడీని అరికట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.