Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పినిపే విశ్వరూప్…

WhatsApp Image 2024-02-24 at 5.56.35 PM

పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు.

అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి జల జీవన్ మిషన్ నిధులైన రూ 30.60 లక్షల వ్యయంతో బీమనపల్లి సూదాపాలెం ఆవాసం నందు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఆయన ప్రారంభించారు.

అదే గ్రామంలో నరేగా+ఆరోగ్య శాఖ నిధులైన రూ. 20.80 లక్షలతో నిర్మించిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గడ్డం సంపద రావు, ఎం.పీ.టీ.సీ. నాగరత్న కుమారి, సర్పంచ్ పి. రాజ్ కుమార్. బి. బాబ్జి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.