విజయవాడలో 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం 19 వ తేదీన ఆవిష్కరించబడుతుందని వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమతా మహాసభ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యప్తంగా అన్ని జిల్లాల నుంచి దలిత సోదర, సోదరీమనులు మరియు బలుగు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని అన్నారు.
ఈ సమావేశానికి దాదాపు లక్ష నుంచి 1.25 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేశారని ఆయన అన్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రోడ్డు షో కాని లేజర్ షో ఉంటుందని అన్నారు. బీ.ఆర్. అంబేద్కర్ స్మృతివనం బలహీన వర్గాల కోసం పనిచేసే భవిష్యత్ తరాల గుర్తుకి, స్ఫూర్తికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఈ ఆడిటోరియం, లైబ్రరీ, పార్కుతో స్మృతివనం పర్యాటక కేంద్రంగా మారుతుంది వెళ్లడించారు.

