రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం వెంటనే విరమించే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు తాడేపల్లి ప్యాలెస్ కి వస్తారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి మోకాళ్ళతో నడుస్తూ కమిషనర్ చాంబర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… హీనమైన పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని అన్నారు. కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలని, లేదంటే పారిశుద్ధ్యంలో ప్రత్యామ్నాయ పనులు చేయిస్తే కార్మికులు అడ్డుకుంటారని ఆమె అన్నారు.
