తెలంగాణ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసి దుండగులు పరారయ్యారని ఆమె డ్రామాలు ఆడింది. కానీ కట్ చేస్తే… యువతి వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. విచారణలోకి వెళ్తే… ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి చోరీ డ్రామా చేసింది. దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని, భీభత్సం చేశారని మీడియా ముందు చెప్పుకొచ్చింది. కానీ పొలీసులు విచారణ మొదలు పెట్టగానే అసలు నిజం బట్టబయలయ్యింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఈ పని చేయవలసివచ్చిందని ఆమె నిజం ఒప్పుకుంది.
పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడిన యువతి… కానీ…!!!
