అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి కార్యాలయంలో మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గతం లో కంటే 6,696 ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యాయని, దిశ యాప్ ద్వారా 148 పిర్యాదుల్లో 16 ఎఫ్ ఐ ఆర్ నమోదు కాగా వాటిలో 131 పరిష్కారం జరిగింది. 86,480 దిశ యాప్ రిజిస్ట్రేషన్ లు ప్రజలచే చేయించడం జరిగిందన్నారు. అలాగే వాట్సాప్ పిర్యాదులు, డయాల్ 100, చాట్ బాట్, స్పందన, జెకేసి నమోదు అయిన పిటిషన్లు పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే నేర విశ్లేషణలో 22 హత్య కేసులు,525 దొంగతనం కేసులు, మహిళలు, పిల్లలు పై జరిగిన నేరాలు 718 లతో పాటు ఇతర కేసులు వివరాలను ఎస్ పి వివరించారు. యస్.ఐ గా ఎంపికైన ముగ్గురిని జిల్లా ఎస్పీ శ్రీధర్ సన్మానించారు.
నేర పరశోదనలో పురోగతి … -ఎస్పీ శ్రీధర్-

