Crime

నేరాలు అదుపు చేయడంలో ప్రజలు సహకరించాలి …

IMG-20231223-WA0000

పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడం, పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ ఉండడం వల్ల నేరాలను, చోరీలను నిరోధించేందుకు ప్రజలు సహకరించాలని సామర్లకోట స్టేషన్ సి.ఐ. సురేష్ అన్నారు. తమ ఇళ్లవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పోలీసులకు సహయపడోచ్చని ఆయన అన్నారు. సామర్లకోట మండలం అయోధ్య రామపురంలో ఇటీవల జరిగిన వరుస చోరీలు నేపథ్యంలో చోరీలకు ఆనకట్ట వేయడానికి ప్రజల సహకారం కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించారు. సి.ఐ. మాట్లాడుతూ… స్టేషన్ పరిధిలో అవసరమైన సిబ్బంది లేనందున పట్టణంలో నేరాలు అదుపు చేయడానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు. గృహాలవద్ద, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలను చాలా వరకు అరికట్టవచ్చు నన్నారు. ఇంకా పలు చట్టాలు, భద్రతలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్కా లలితాశ్రీనివాస్, నాయకులు జానకిరామయ్య, వార్డు పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.