డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్, ఏ.పీ.ఎస్. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. గోపీనాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులగా విచ్చేసారు. మొదట శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లా స్థాయికి తగిన రీతిలో ప్రజానీకo ప్రయాణించడానికి వీలుగా ఉండేలా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసారన్నారు. ఈ అత్యాధునిక బస్ స్టేషన్ టెర్మినల్ నిర్మాణం కొరకు తొలి దశలో రూ 5 కోట్ల నిధులు రాష్ట్ర రవాణా శాఖ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు ఇళ్ళ వెంకటేశ్వరరావు, బొమ్మి ఇజ్రాయిల్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆర్.వి.ఎస్. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

