గ్రామాల్లో సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు ఎర్పాటు చేయనుందని తెలియచేసింది. నీటిలో హానికర లోహాలు, బ్యాక్టీరియాలు పరిమితికి మించి ఉన్నాయా అనే దాన్ని పరిక్షించేందుకు నీటి నాణ్యతను పరిక్షించడానికి ప్రభుత్వం ఆర్.డబ్ల్యు.ఎస్. ద్వారా ప్రతీ గ్రమానికి ప్రత్యేక కిట్లను పంపిణీ చేసింది. ఒక్కో కిట్ తో 100 వరకు నీటి నాణ్యతను పరిక్షించవచ్చని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,781 గ్రామాల్లో పరిక్షల నిర్వాహనకు ఒక్కో గ్రామాంలో పొదుపు సంఘాల మహిళలతో పాటు ఆ పరిది అంగన్ వాడి టీచర్, ఆశా వర్కర్ లేదా ఏ.ఎన్.ఎమ్. లతో కూడిన ఒక కమిటీను నియమించనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
నీటి నాణ్యత పరీక్షలు కోసం ప్రత్యేక కమిటీలు….
