టీ.డీ.పీ. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, టీ.డీ.పీ. అధినేత చంద్రబాబునాయుడు తన కాళ్లపై పడవద్దని ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి పాదాలకు నమస్కరించాలే తప్ప రాజకీయ నేతలకు నమస్కరించకూడదని స్పష్టం చేశారు. తన విజ్ఞప్తిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలను కోరుతూ.. ఇకపై ఎవరైనా తన పాదాలను తాకడానికి ప్రయత్నించినట్లయితే తాను కూడా అదే విధంగా బదులిస్తానని నాయుడు నొక్కి చెప్పారు. రాజకీయ నేతలు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని సూచించారు.
నా కాళ్లపై పడొద్దు… -చంద్రబాబు-
