యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వరప్రసాద్, నాయకులు పిల్లి రామారావు, పెమ్మాడి కిరణ్ కుమార్, తదితరులు కలిశారు. నారా లోకేష్ కు సంక్షేమ పథకాలు సంబందించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత వై.. ప్రసీ.పీ. భుత్వం దళితులకు చేసిన అన్యాయాలను సరిదిద్దాలని ముఖ్యంగా రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి పున ప్రారంభించాలని కోరారు.
ఇప్పటి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేసి డోర్ డెలివరీ చేసిన అధికార పక్షం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పై కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించి ముద్దాయికి సహకరించారని, రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు అత్యాచారాలపై సమగ్ర విచారణ జరిపించి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

