ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికి ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టం రద్దు అయ్యే వరకు పోరాడతామని కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముత్తంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ చట్టం ప్రమాద తీవ్రతను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల మేలుకన్నా వారి స్వలాభం కోసమే చట్టాలు చేస్తున్నాయని విమర్శించారు.
ఈ చట్టం వల్ల ప్రతి సాధారణ పౌరుడు తన ఆస్తి కి దూరమయ్యే ప్రమాదం ఉందని, ఎప్పుడూ తమ ఆస్తి ని కాపాడుకోవడానికి మేలుకునే ఉండాన్నారు. ఈ దీక్షలో యు శంకరశర్మ , బాదం వెకటేశ్వరావు , ఓబిలిశెట్టి సత్యనారాయణ , పి పావని, నీరజ పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాదులు శాస్త్రి , బచ్చు రాజేష్, వెంకట రెడ్డి బహుదూర్ షా , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
