కాకినాడ జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నకలీ కరెన్సీ కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 లక్షలు నకలీ కరెన్సీ ని ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలుకున్న ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు అక్కిడికి వచ్చి వారిని తనిఖీ చేసి ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై వి. కిషోర్ బాబు మాట్లాడుతూ… 4గురు సభ్యులతో కూడిన దొంగనోట్ల ముఠాను జాతీయ రహదారిపై ఎస్.బీ.ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీ సమీపంలో అన్నవరం పోలీసులు పట్టుకున్నారని వెళ్లడించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నకిలీ కరెన్సీ తో ముఠా అరెస్టు…

