రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రానికి 51 రోజుల క్రితం రైతులు వరిదిగుబడిని విక్రయించారు. ఇప్పటి వరకూ తమ అకౌంట్లలో నగదు పడలేదంటూ బాదిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ అయినవిల్లి మండలం నేదునూరు గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమ భార్యల పుస్తెలు తాకట్టుపట్టి సాగుచేసినప్పటికీ పంట దిగుబడి ఆర్బీకేలకు విక్రయించినా తమ రెక్కల కష్టానికి ఫలితం లేకపోతోందంటూ గోడువిన్నవించుకున్నారు.
ధాన్యం సొమ్మురాక… దైన్యంలో రైతు…
