తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిదిలో ఉన్న ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క మరమత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ను మళ్లించిన విషయం తెలిసిందే. అయితే పనులు పూర్తి కానందున మరో 5 రోజులు పొడిటించి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ను మళ్లించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పరిశర ప్రాంత వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇరిగేషన్ రివర్ కన్సర్వేటివ్ ఈ.ఈ. వి. కాశీ విశ్వేశ్వర రావు మాట్లాడుతూ… కాంక్రీట్ క్యూరింగ్ పనుల నేపథ్యంలో మరో ఐదు రోజులు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు తెలిపారు.
ధవలేశ్వరం బ్యారేజ్ మరో 5రోజులు ట్రాఫిక్ మళ్లింపు…!!!

