తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో భూ లావాదేవీలకు సంబంధించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పిల సదస్సులో భాగంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతామని ఆయన అన్నారు.
ఎన్నికల ముందు ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రజలకు వివరించామని మళ్లీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచిన భూములను గత ప్రభుతం లాక్కుందని విమర్శించారు. కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని మళ్లీ ప్రజలకే పంచుతామని ప్రకటించారు.

