రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, ట్రాన్స్ పోర్ట్ సమ్మె సందర్బంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏ.ఐ.టి.యు.సి. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా రమణ, ఏ.పీ. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ…

