దుమ్ములపేట లో యుపీహెచ్సీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, తదితరులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… కాకినాడ నగరంలో దుమ్ములపేట లో వైఎస్సార్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (యుపీహెచ్సీ) ని 1.89 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించారని అన్నారు. తారకరామా నగర్, దుమ్ములపేట వాసులకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఈ ప్రాధమిక ఆసుపత్రిని నిర్మించారన్నారు. ఈ కార్యాక్రమానికి కాకినాడ సీ పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ కే.వీ. రావు, కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ములపేటలో కొత్త యూ.పీ.హెచ్. ప్రారంభం…

