Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు.

వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను తీసిపారేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… త్వరలో జల్లి విల్సన్, ఆవుల శేఖర్ నాయకత్వం లో ఇల్లు లేని పేదలకు భూ పోరాటం చేసి పాకలు వేస్తామని అన్నారు . అదే విధంగా పిడబల్యుడి కాలవ పక్కన ఉన్న పాకలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

గత 40 సంవత్సరాలుగా పేదలు ఇక్కడే జీవిస్తున్న పాలకులు న్యాయం చేయడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందంచి తగు న్యాయం చేయాలని మధు కోరారు. ఈ కార్యక్రమం లోమంగళగిరి దేవి, పిట్టా భావాని, ఎం. రామలక్ష్మి, సంగం వినిత కీర్తన, మానెపల్లి సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.