Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు.

కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు జయహో బీ.సీ. సమావేశాన్న నగర బీ.సీ. సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బీ.సీ.ల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేయడం జరిగిందని, బీసీలకు అత్యున్నత పదవులు కల్పించి గౌరవించుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

ఈ సమావేశానికి తుని నియోజకవర్గ నాయకులు యనమల కృష్ణుడు, కాకినాడ నియోజవర్గ పరిశీలకులు నాగిడి నాగేశ్వరరావు, సత్య స్కాన్ అధినేత కాదా వెంకటరమణ, కాకినాడ రూరల్ నాయకలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిబోయిన శ్రీనివాస యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.