Political

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి…

OIF

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీ.పీ.సీ.సీ. చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రేపు(సోమవారం) రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సమాచారం. ప్రమాణ స్వీకారం గురించి రేవంత్ తెలంగాణ డీ.జీ.పీ. కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, మంత్రుల ప్రమాణానికి ఏర్పాటు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

దేశ నలుమూలల నుంచి వీ.ఐ.పీ. లు వస్తారని ఈ నేపథ్యంలో తగిన భద్రతపై డీ.జీ.పీ. తో చర్చించినట్టు సమాచారం. ఇందులో భాగంగానే రేపు ఉదయం గాంధీభవన్‌లో సీఎల్పీ నేతలు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీ.ఎం. పదవికి కే.సీ.ఆర్‌. రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అయితే, సీఎం కాన్వాయ్‌ లేకుండానే కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లడం విశేషం.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.