తెలంగాణ రాష్ట్రంలో ఘోర ఘటన చేటుచేసుకుంది. పంటలు ఎండిపోవడంతో అప్పులుపాలయ్యి ఇద్దరు రైతులు ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురానికి చెందిన 47 సంవత్సరాల ఉచ్చెంతల శ్రీను అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి పంటను వేసాడు. దానిని కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసాడు, కానీ బోర్లులో నీళ్లు పడకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. దానితోపాటు ఇంటి నిర్మాణం కోసం బోర్లు వేసేందుకు సాగు పెట్టుబడికి రూ. 10 లక్షలు అప్పు చేశాడు. అప్పు బాద భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగారం గ్రామంలో 42 సంవత్సరాల ముసలిగల అనంతయ్య అనే రైతు తన 30 గుంటల పొలంలో వరి, 2 ఎకరాల్లో కంది, మక్క సాగు చేశాడు. అయితే వర్షాలు లేక కంది, మక్క పంటలు ఎండిపోయి నష్టం జరిగడంతో ఆ బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య…!!!

