చెన్నై నుంచి హైదరాబాద్ వెల్లే రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అందులో ఉన్నవారిని బటకి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలాపారు. చెన్నైలోని డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లికి చేరుకుని స్టేషన్లో ప్రవేశించేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్ నంబర్ 5 మీదికి వచ్చిన అనంతరం పట్టాలు తప్పి అక్కడ గోడకు గుద్దుకుందని అన్నారు.
