కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ.- జనసేన కలిసి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీ.డీ.పీ. నాయకులు బండారు సత్యనారాయణ, రాజప్ప, అనిత, మహ సేన రాజేష్, జనసేన నాయకులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా పంతం నానాజీ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా మహీ సభను నిర్వహించారని అన్నారు. ఈ సభకు 6 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, ఎన్టీఆర్ పిలుపుతో 9 నెలల్లోనే అధికారంలోకి ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని, తెలుగుదేశం పిలుస్తుంది రా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 10వ తేదీన కాకినాడ జిల్లా తునిలో మహాసభను కాకినాడ పార్లమెంట్లో యనమల ఆధ్వర్యంలో కార్యక్ర మాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జనసేన టీ.డీ.పీ. సంయుక్త ఆధ్వర్యంలో సభను నిర్వహించడం జరుగుతుందన్నారు.
తునిలో ప్రారంభం కానున్న రా కదలిరా మహ సభ…

