రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై కక్షసాదింపు చర్యలు చేపట్టారని మండి పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని చేప్పినా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. పిల్లలతో జరుపుకోవలసిన సంక్రాంతి పండుగకు దూరంచేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు, రమణ, సుబ్బలక్ష్మి, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తునిలో అంగన్వాడీలు సమ్మె…

