Exclusive

తిరుమలలో వెయ్యికాళ్ల మండపం పునఃనిర్మించాలి…

exl

తిరుమలలో14వ శతాబ్దం1472 నందు నిర్మిత మైన వెయ్యి కాళ్ళ మండపాన్ని 20 వ శతాబ్దంలో 2003లో తొలగించడం జరిగందని శతాబ్దాల చరిత్రను తిరిగి పునః నిర్మాణంచేసే ప్రక్రియను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని స్వయంభు కాకినాడభోగిగణపతి పీఠం కోరింది. శనివారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం ప్రాంగణం నందు తిరుమలశ్రీవారి పాదాల వద్ద గోవిందుని 43వ సహస్ర నామ జపయజ్ఞ పారాయణలో సంకీర్తన నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కలశాలకు విష్వక్సేన పూజలతో శ్రీవారి సేవకులు మంగళ హారతులందించారు. గణపతి వేంకటే శ్వర పంచలోహ ప్రతిమలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్ల పూడి రమణ రాజు మాట్లాడుతూ… తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని తొలగించి మరోచోట నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలే దన్నారు. వాటికి అపచారం జరగకుండా భద్రపరచాలని టీ.టీ.డీ. ని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.