తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన సమన్వయ బాధ్యతలను తమ్మినేని వెంకటేశ్వర్లుకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. సహ సమన్వయకర్తగా ఎం. హరిశంకర రావును నియమించినట్లు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని వారికి పార్టీ అధ్యక్షులు సూచించారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను యెల్లటూరి శ్రీనివాస రాజుకి అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీలో మరో ఇద్దరు సభ్యులకు స్థానం కల్పించారు. శ్రీ నల్లా అజయ్, శ్రీమతి గౌతు లక్ష్మీ కుమారిలను సభ్యులుగా నియమించారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సమన్వయకర్తగా శ్రీ మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ)ని నియమించారు.

