తిరుపతిలలో జనసేన వారాహి విజచభేర సభను ఏర్పాటుచేసారు. ఈ సభకు ముఖ్య అతథిగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తిరుమల వైకుంఠవాసుడు కొలువైన ప్రాంతమని, ఆయన పాదాల వద్ద కొలువుదీరిన ప్రాంతం తిరుపతి అని అన్నారు. ఏడు కొండల స్వామి పాదాల చెంత ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఆకు రౌడీలకు భయపడాల్సి అవసరం లేదన్నారు. తిరుపతి ఆధ్యాత్మికతను మంటగలిపే రౌడీలపై ప్రజలంతా తిరగబడాల్సిన సమయం వచ్చిందని, ఓటుతో వారికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చేసిందని ఆయన స్పష్టం చేశారు. పవిత్రత మంట గలిపి ప్రతి విషయంలోనూ తిరుపతిని అవినీతిమయం చేసి దోచుకుంటున్న తండ్రీకొడుకులకు బుద్ది చెప్పాలని సూచించారు.
తిరుపతి పవిత్రతను కాపాడుతాం… -పవన్ కళ్యాన్-

