తిరుపతి జిల్లా వాకాడు మండలం లో మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్ట పోయిన బాధితులను, రైతులను పరామర్శించేందుకు కోట మండలం కేంద్రం విద్యానగర్ మైదానం నందు ఏర్పాటు చేసిన విద్యానగర్ హెలిప్యాడు దగ్గరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఆయనను సంబందిత అధికారులు ఘన స్వాగతం పలికారు. సీ.ఎం. వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి వున్నారు. అనంతరం హెలిప్యాడు నుండి రోడ్డు మార్గాన వాకాడు మండలం,బాలిరెడ్డి పాళ్యం నందు మిచాంగ్ తుఫాన్ లో పంటలు నష్ట పోయిన రైతులను పరామర్శించుటకు బయలుదేరి వెళ్లారు.
