కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ బాలాజీ, తుమ్మల రమేష్ లు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి తో ఇబ్బందులు పడుతున్న దుమ్ములు పేట, సంజయ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా కు వినతి పత్రం అందజేడంతో ఒక్క సారిగా కలెక్టర్ ఖంగుతిన్నారు. నగరంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న సమాచారం తన దృష్టికి రాలేదని స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా చెప్పడం పట్ల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎటువంటి శ్రద్ధ ఉందో తేటతెల్లం చేస్తోందన్నారు.
తాగునీరు కోసం కాకినాడ ప్రజలు వెతుకులాట…

