Crime

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా…? -పవన్ కళ్యాన్-

OIP (30)

రాష్ట్రంలో వై.సీ.పీ. దుర్మార్గపు పాలనలో పంచ భూతాలకు కూడా పార్టీ రంగులు పూయడం చాలా దౌర్భాగ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. తాగునీరు కోసం ప్రజలు రాజకీయంగా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చాలా విచారకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానావత్ సమూనిబాయి వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన పై పవన్ స్పందించారు.

ప్రతిపక్ష పార్టీలకు తాగునీరు అందడం లేదని ఆమె అన్నారని ఆమె ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా చేసారని మండిపడ్డారు. ఆమె ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోయి ఆమెను ట్రాక్టర్ తో ఢీకొని చంపేసారన్నారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో అనాగరిక పాలనకు నిదర్శనం అన్నారు. కేవలం వైసీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే నీళ్లు తాగడానికి గాలి పీల్చుకోవడానికి వీలుంటుందని జి.ఓ జారీ చేయడమే మిగిలిందన్నారు. మల్లవరం ఘటనపై పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వారి కుటంబానికి న్యాయం చేయాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.