ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో కొద్దిపాటి వర్షపాతం నమోదైన తర్వాత, నేటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు దేశ రాజధానిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో భారత వాతావరణ శాఖ ఐ.ఎం.డీ. ఎల్లో అలర్ట్‌ని జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం… మంగళవారం దేశ రాజధానిలో కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ మరియు గురువారాల్లో నగరం అంతటా చాలా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని ఐ.ఎం.డీ. తెలిపింది.
ఢిల్లీ లో ఆగస్టు 8 వరకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం…