కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. దేనికి తలవంచని మోడీని మెడలు వంచిన ఘనత ఢిల్లీ రైతు ఉద్యమానికి దక్కుతుందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 450 రైతు సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిందన్నారు.
13 నెలలుగా నిర్విరామంగా నిద్రాహారాలు మాని రైతులు చేసిన పోరాటానికి మోడీ తలవంచక తప్పలేదని అన్నారు. ఈ పోరాటం పై ఐక్యరాజ్యసమితి సుప్రీంకోర్టు స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. నోట్లు రద్దు, జీఎస్టీ, బ్యాంకులో ప్రైవేటీకరణ వంటి వాటిలో వెనక్కు తగ్గని మోడీ రైతు పోరాటంతో క్షమాపణ చెప్పడం జరిగిందని పేర్కొన్నారు.

