ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి రెగ్యులర్ బెయిల్ మంజూరు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్ చేసింది.
వాదనలు వినిపించారు, తీర్పు రిజర్వ్ చేసినప్పటికీ హక్కులు, వివాదాలకు పక్షపాతం లేకుండా అప్పీలుదారు చట్టానికి అనుగుణంగా బెయిల్ మంజూరు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని బెంచ్‌ను ఉటంకిస్తూ పి.టి.ఐ. నివేదించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వీ. రాజు వాదించారు.

