ఢిల్లీ ప్రభుత్వం 13 ఏళ్ల తర్వాత కాలుష్య తనిఖీ రేట్లను గురువారం సవరించింది. అంటే వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీకి ఫీజులు పెరిగాయి. పెట్రోల్, సి.ఎన్.జి. లేదా ఎల్.పి.జి. టూ, త్రీ-వీలర్‌లకు సవరించిన ధరలు రూ. 80గా నిర్ణయించబడ్డాయి. పెట్రోల్, సీ.ఎన్.జీ. లేదా ఎల.పీ.జీ. నాలుగు చక్రాల వాహనాలకు సవరించిన ధరలు రూ. 110 గా నిర్ణయించబడ్డాయి. డీజిల్‌తో నడిచే వాహనాలకు, కాలుష్య తనిఖీ రేటు రూ. 140గా నిర్ణయించబడింది.
కాలుష్య తనిఖీ సేవలపై పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు. ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లకు ప్రతిస్పందనగా మరియు కాలుష్య తనిఖీ సేవలపై పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రేట్లను సవరించాలని నిర్ణయించుకున్నామని కైలాష్ గహ్లోట్ చెప్పారు.
