దేశ రాజధానిలోని పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపుపై వచ్చిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. న్యూఢిల్లీలోని 4,600 పాఠశాలల కోసం మొత్తం ఐదు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లు, 18 బాంబు డిటెక్షన్ బృందాలు ఉన్నాయని నగర పోలీసులు ఢిల్లీ హైకోర్టుకి తెలిపినట్లు ఒక నివేదిక పేర్కొంది. పాఠశాలలకు బాంబు బెదిరింపులను ఎదుర్కోవడానికి గత సంవత్సరం మార్గదర్శకాలను జారీ చేశామని అన్నారు. బాంబు బెదిరింపు విషయంలో బీ.డీ.ఎస్. ని మోహరించడానికి నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం కోర్టులో దాఖలు చేసిన స్థితి నివేదికలో పేర్కొన్నారు. 2023 జనవరి 1 నుంచి ఈ ఏడాది మే 6 వరకు పాఠశాలల్లో 120 మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు తెలిపారు.
ఢిల్లీ బాంబు బెదిరింపులు కేసులో హెచ్.సీ. కి నివేదిక…
